జమ్మూకశ్మీర్‌లో భీకర కాల్పులు..

జమ్మూకశ్మీర్‌లో భీకర కాల్పులు..
X

భీకర కాల్పులతో జమ్మూకశ్మీర్ మరోసారి దద్దరిల్లింది. అనంతనాగ్‌లో భద్రతా దళాలకు.. టెర్రరిస్టులకు ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. సైనికులు సోదాలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు తారసపడ్డారు. ఓ ఇంట్లో ఉగ్రమూకలు నక్కి ఉన్నారనే సమాచారంతో జవాన్లు కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరి మధ్య భీకరకాల్పులు జరిగాయి. రెండు, మూడు గంటల పాటు జరిగిన టెర్రర్ ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు భద్రతాదళాలు. ఇంకొంత మంది టెర్రరిస్టులు ఉన్నారనే సమాచారంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు సైనికులు. 370 రద్దుతో ఉగ్రదాడులు జరగొచ్చనే సమాచారంలో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయ. అనువనువునా జల్లెడ పడుతున్నాయి.

Tags

Next Story