వైసీపీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ

వైసీపీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ
X

కడప జిల్లా రాజంపేటలో మండలం పోలి గ్రామంలో వైసీపీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. చెరువు మట్టి విషయంలో పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. దీంతో ముగ్గురి తలలకు తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని రాజంపేట ఆస్పత్రికి తరలించగా అక్కడ కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒకరినొకరు దూషించుకుంటూ డాక్టర్‌ ముందే కుర్చీలతో ఘర్షణకు దిగారు. దీంతో ఆస్పత్రి ఎదుట ఉన్న ఇరువర్గాలకు చెందిన వారిని పోలీసులు చెదరగొట్టారు. ఉద్రిక్తత పరిస్థితుల నేపధ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story