కర్నూల్ లో వైసీపీ నేతల బీభత్సం.. భయంతో పరుగులు తీసిన జనం

కర్నూలు కలెక్టరేట్‌ ప్రాంగణంలో అధికార పార్టీ వర్గీయులు బీభత్సం సృష్టించారు. కోడిగుడ్ల టెండర్లు దక్కించుకునే విషయంలో వివాదం తలెత్తడంతో... ఇరు వర్గాల వారు పరస్పరం రాళ్ల దాడికి దిగారు. DEO ఆఫీసు ఎదుట ఇష్టం వచ్చినట్లు కొట్టుకున్నారు.

ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా... జనం భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. దుండగులు... DEO ఆఫీసులోకి కూడా చొరబడడంతో... సిబ్బంది హడలిపోయారు. పోలీసుల రాకతో దుండగులు పరార్‌ అయ్యారు. ఘటనను వీడియో తీస్తున్న మీడియా ప్రతినిధుల సెల్‌ఫోన్లు సైతం ఆగంతకులు లాక్కెళ్లారు.

Tags

Next Story