యువతిని కత్తితో పొడిచి.. పురుగులమందు తాగిన ప్రేమోన్మాది

యువతిని కత్తితో పొడిచి.. పురుగులమందు తాగిన ప్రేమోన్మాది

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పోడూరు మండలం కవిటం గ్రామంలో సుధాకర్‌ రెడ్డి అనే ఉన్మాది.. యువతిపై కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాల పాలైన యువతిని పాలకొల్లు ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగానే.. పరిస్థితి విషమించడంతో ఆమెను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యువతిపై దాడి అనంతరం ఉన్మాది సుధాకర్‌ రెడ్డి కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం నిందితుడు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

సుధాకర్‌ రెడ్డి గత కొంతకాలంగా యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. అయితే అతనికి అప్పటికే వివాహం కావడంతో ఆమె నిరాకరించింది. అయినా భార్యకు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకుంటానని వేధిస్తున్నాడు. వెంట పడొద్దని గతంలోనే యువతి వార్నింగ్‌ ఇచ్చింది. దీంతో పగ పెంచుకున్న సుధాకర్‌ రెడ్డి యువతిపై దాడికి తెగబడ్డాడు.

Tags

Read MoreRead Less
Next Story