అందుకే ఈ సినిమా ప్రొడ్యూస్ చేశా : విజయ్ దేవరకొండ

అందుకే ఈ సినిమా ప్రొడ్యూస్ చేశా : విజయ్ దేవరకొండ

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి.. కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై "మీకు మాత్రమే చెప్తా" అనే సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్బంగా విజయ్ చేస్తున్న ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ చాలా బాగుంది. అని మహేష్ బాబు అన్నారు. 'మీకు మాత్రమే చెప్తా' కాన్సెప్ట్ బాగా నచ్చి నేనే ప్రొడ్యూస్ చేశాను.

నిర్మాత బాధ్యతలు మా నాన్న వర్ధన్ దేవరకొండ తీసుకున్నారు. నా ఫేవరేట్ హీరో మహేష్ బాబు గారు ట్రైలర్ లాంఛ్ చేయడం చాలా అందంగా ఉంది. ట్రైలర్ మీకు బాగా నచ్చుతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు విజయ్. కాగా ఈ పెళ్లిచూపులు ఫేమ్ తరుణ్ భాస్కర్ హీరోగా.. షమ్మీర్ సుల్తాన్ దర్శకుడిగా ఈ సినిమా తెరకెక్కింది. శివకుమార్ సంగీతం సమకూర్చారు.

Tags

Read MoreRead Less
Next Story