కొత్తగా వెయ్యి రూపాయల నోటు : నిజమా.. అబద్ధమా..

నోట్ల రద్దు తరువాత ఆర్బీఐ రూ.2000, రూ.500, రూ.200, రూ.100, రూ.50. రూ.10 నోట్లను తీసుకువచ్చింది. అయితే ఇప్పుడు రూ.2000 నోటును రద్దు చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ పావులు కదుపుతోన్నట్టు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క రూ.2000ల నోటును కూడా ముద్రించలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 3,542.991 మిలియన్ రూ.2 వేల నోట్లను ఫ్రింట్ చేసిన ఆర్బీఐ.. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 111.507 మిలియన్ నోట్లన ముద్రించింది. ఇక 2018-19 సంవత్సరానికి వచ్చే సరికి 46,690 మిలియన్ నోట్లకు చేరింది. ఈ ఏడాది ఇంతవరకు ఒక్క రూ.2 వేల నోటును కూడా ఆర్బీఐ ముద్రించలేదు. ఇదిలా ఉండగా, 2వేల నోటును బ్యాన్ చేస్తే మళ్లీ వెయ్యి రూపాయల నోటు మార్కెట్‌లోకి వస్తుంది అని ఊహాగానాలు మొదలయ్యాయి. వీటికి బలం చేకూరుస్తూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అది కొత్త వెయ్యి రూపాయల నోటు ముద్రించినట్లు చూపిస్తున్నారు. వెయ్యి నోటు కూడా కొత్త రూపుతో ప్రత్యక్షమైంది. వాస్తవానికి రూ.1000 నోటును తీసుకొస్తున్నట్లుగానీ, దానికి సంబంధించిన నమూనా చిత్రంగానీ ఆర్బీఐ నుంచి వెలువడలేదు. కాబట్టి సోషల్ మీడియాలో వెయ్యి రూపాయల నోటు వస్తుందన్న వార్తల్లో నిజం లేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com