ఆంధ్రప్రదేశ్‌ హౌసింగ్‌ శాఖలో రివర్స్‌ టెండరింగ్

ఆంధ్రప్రదేశ్‌ హౌసింగ్‌ శాఖలో రివర్స్‌ టెండరింగ్
X

ఆంధ్రప్రదేశ్‌ హౌసింగ్‌ శాఖలో రివర్స్‌ టెండరింగ్ ప్రక్రియకు సిద్ధమైంది.. జగన్‌ సర్కారు. ఇందులో భాగంగా... పట్టణ గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లోనూ రివర్స్‌ టెండరింగ్‌ చేపట్టనున్నారు. ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత, అవినీతికి తావు లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఏపీ టిడ్కోలో కూడా రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియ నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన విధివిధానాలను కూడా ఖరారు చేశారు.

Tags

Next Story