ప్రభాస్ అభిమానులకు శుభవార్త.. ఈనెల 19 నుంచి..

ప్రభాస్ అభిమానులకు శుభవార్త.. ఈనెల 19 నుంచి..

బాహుబలి తరువాత భారీ హిట్ కోసం ప్రభాస్‌ చేసిన సినిమా సాహో. 350 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు తొలి రోజు నుంచే డివైడ్‌ టాక్‌ వచ్చింది. అయినా కలెక్షన్ల సునామి సృష్టించింది. సినిమా ప్లాప్ టాక్ వచ్చినా.. అసలేముందో చూద్దామని సినిమా చూసిన వాళ్లే ఎక్కువ. దాంత్ దక్షిణాదిలో ఓ మోస్తరు వసూళ్లు రాబట్టిన ‘సాహో’ హిందీలో ‘సాహో’ అనిపించింది. హిందీలో ఏకంగా వందకోట్లకు పైగానే వసూలు చేసింది.

ఇదిలావుంటే త్వరలోనే ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ లో విడుదల కానుంది. ఈ నెల 19 నుంచి హిందీ మినహా అన్ని భాషల్లో సాహో సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులోకి వస్తున్నట్టు సమాచారం. రూ.42 కోట్ల భారీ ధ‌ర‌తో ‘సాహో’ డిజిట‌ల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ ద‌క్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక, ఈ సినిమా హిందీ వెర్షన్ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉండనున్నట్టు సమాచారం. కాగా సుజీత్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ పతాకంపై నిర్మాతలు.. వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ లు సాహో సినిమాను నిర్మించారు. బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా రూ. 420 కోట్లకుపైగా వసూళ్లు సాధించి రికార్డ్‌లు సృష్టించింది.

Tags

Read MoreRead Less
Next Story