పోస్టాఫీస్‌లో సేవింగ్.. సంవత్సరానికి రూ.1.5 లక్షలు ఆదా..

పోస్టాఫీస్‌లో సేవింగ్ చేస్తే డబ్బుకి భద్రతతో పాటు ఆదాయపు పన్ను చట్టం నుంచి మినహాయింపు కూడా ఉంటుంది. ఇందులో కస్టమర్లకు ఆఫ్‌లైన్ సేవలతో పాటు ఆన్‌లైన్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. వివిధ రకాల పథకాలు పోస్టాఫీసులో అందుబాటులో ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీ కింద ఉన్న కొన్ని స్కీమ్స్ గురించి.. పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్, నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్, నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ అకౌంట్, నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్‌కమ్ అకౌంట్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ అకౌంట్, కిసాన్ వికాస్ పత్ర అకౌంట్, సుకన్య సమృద్ధి ఖాతా వంటి పథకాలు అందిస్తోంది.
ఈ పథకాల్లో నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, పీపీఎఫ్ అకౌంట్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, సుకన్య సమృద్ధి ఖాతా వంటి పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి అకౌంట్‌పై ట్రిపుల్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. పెట్టుబడి పెట్టిన డబ్బు, దీనిపై వచ్చిన వడ్డీ, వెనక్కు తీసుకుంటున్న మొత్తంపై ఎలాంటి పన్ను ఉండదు. టైమ్ డిపాజిట్లపై 7.7 శాతం వడ్డీ వస్తే.. పీపీఎఫ్, ఎన్‌ఎస్‌పీ, సుకన్య సమృద్ధి ఖాతాలపై 7.9 శాతం వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌పై 8.6 శాతం వడ్డీ పొందొచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com