టీఎస్‌ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో గవర్నర్ ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ

తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు తమిళిసై. దాదాపు అరగంట పాటు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించారామె. రాష్ట్రంలో ఇతర సంఘాలను కూడా కూడదీసుకొని ఉద్యమిస్తున్న ఆర్టీసీ సమ్మెపై ప్రధానికి వివరించినట్లు తెలుస్తోంది. రాజ్ భవన్ లో చేపట్టిన వినూత్న అంశాలపై ప్రధానికి నివేదిక అందించారు. ప్టాస్టిక్ నిషేధం, యోగా తరగతులు, రక్తదానశిబిరం వంటి కార్యక్రమాలపై నివేదిక అందించగా.. ప్రధాని మోదీ గవర్నర్ తమిళిసైను అభినందించారు.
ప్రధానితో సమావేశం తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులే ప్రధాన అజెండా ఈ మీటింగ్ కొనసాగినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ సమ్మెతో తెలంగాణ అట్టుడుకుతున్న నేపథ్యంలో గవర్నర్ తమిళిసై.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణాలో ఏం జరుగుతోందని అమిత్ షా ఆరా తీశారు. ఆర్టీసీ సమ్మె, కార్మికుల ఆత్మహత్యలపై అమిత్ షా గవర్నర్‌ను అడిగి తెలుసుకున్నారు. వాస్తవానికి గవర్నర్‌కు ఈ నెల 20న అపాయింట్‌మెంట్ ఉన్నప్పటికీ తెలంగాణాలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ముందుగానే ఢిల్లీకి రమ్మన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com