టీఎస్ఆర్టీసీ సమ్మెపై చర్చల దిశగా ముందడుగు

టీఎస్ఆర్టీసీ సమ్మెపై చర్చల దిశగా ముందడుగు

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశాలతో చర్చల దిశగా ఒక అడుగు ముందుకు పడింది. బుధవారం తెలంగాణ సీఎస్‌తో టీఎన్జీవో అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి సమావేశం కానున్నారు. ఆర్టీసీ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నారు. మొత్తంగా తాజా పరిణామాలతో కేసీఆర్‌ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిని రేపుతోంది.

అటు ప్రభుత్వాన్ని, ఇటు కార్మికులపై ప్రశ్నల వర్షం కురిపించిన ఉన్నత న్యాయస్థానం.. సమ్మె పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రెండ్రోజుల్లో శుభవార్తతో రావాలన్నారు. దీంతో ఆర్టీసీ జేఏసీ నేతలు.. టీఎన్జీవో నేతలతో సమావేశయ్యారు. 11 రోజులుగా సాగుతున్న సమ్మెపై సంఘాల నేతలు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వంతో.. చర్చలకు టీఎన్జీవో అధ్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డిని పంపాలని నిర్ణయించారు. ఆర్టీసీ సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించిన టీఎన్జీవో సంఘం అధ్యక్షడు కారెం రవీందర్‌రెడ్డి.. 11రోజులుగా సమ్మె చేస్తున్న వేలాది మంది కార్మికులు తమ మద్దతు కోరుతున్నారని, సీఎస్‌ను కలిసి ఆర్టీసీ సమస్యల్ని విన్నవిస్తామన్నారు. ఇద్దరు కార్మికుల మృతి తమను కలిచివేసిందని.. సమ్మెకు ఇకనైనా ముంగిపు పలకాల్సి ఉందని ఎన్జీవో సంఘాలంటున్నాయి.

అటు హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై తీవ్ర వాదోపవాదనలు జరిగాయి. ఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీసీ సమ్మెపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. రెండు రోజుల్లో సమ్మెపై కోర్టుకు నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సర్కార్‌ మెట్టుదిగి కార్మికులతో వెంటనే చర్చలు జరిపి.. ప్రజలకు సమస్య లేకుండా చూడాలని సూచించింది. ఈ నెల 18లోగా చర్చలు ముగించి శుభవార్తతో రావాలంది. చర్చలతో ఎలాంటి సమస్య అయినా పరిష్కరించుకోవచ్చన్న ఉన్నత న్యాయస్థానం.. కార్మికులు ఎవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించింది. రెండ్రోజుల్లో ఎలాంటి నిర్ధిష్ణ ప్రణాళిక చర్యలు తీసుకుంటారో.. ప్రభుత్వం నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అంతేకాదు.. తక్షణమే ఆర్టీసీకి ఎండీని నియమించాలని ఆదేశించింది.

Tags

Read MoreRead Less
Next Story