అనసూయ ఆ హీరో గురించి..

అనసూయ ఆ హీరో గురించి..

బుల్లితెరపై సందడి చేస్తున్న యాంకర్ వెండితెరపై కూడా వెలిగిపోతోంది. వరుస సినిమాలతో అవకాశాలను అందిపుచ్చుకుంటూ మంచి పాత్రల్లో మెరుస్తోంది. రంగస్థలంలోని తన పాత్ర ద్వారా తన రేంజ్‌ని అమాంతం పెంచేసిన అనసూయ తాజాగా 'మీకు మాత్రమే చెప్తా' సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించింది. ఈ చిత్రాన్ని హీరో విజయ్ దేవరకొండ నిర్మించారు. ఒకప్పుడు అర్జున్ రెడ్డి సినిమాలో వాడిన కొన్ని అభ్యంతరకర పదాల గురించి విమర్శించిన అనసూయ.. మరి ఈ చిత్రంలో అతడి గురించి ఏం చెప్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టనున్నారు యూనిట్ సభ్యులు. ఈ చిత్రంలో పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటించారు. నవంబర్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags

Read MoreRead Less
Next Story