ఘోర రోడ్డు ప్రమాదం.. 35 మంది మృతి

సౌదీ అరేబియాలో బుధవారం అర్ధరాత్రి రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 40 మంది యాత్రికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు మదీనా ఫ్రావిన్స్‌లోని అల్ అఖర్ సెంటర్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న భారీ ప్రొక్లెయినర్‌ను ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున బస్సులో మంటలు చెలరేగాయి. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు కొంతమంది సజీవదహనం అయ్యారు. కొంతమంది ప్రయాణికులు కిటికీ అద్దాలు పగలగొట్టి బయటకు వచ్చారు. అయినా ఈ ఘటనలో 35 మంది విదేశీయులు మృతి చెందినట్లు సౌదీ అరేబియా వార్తాసంస్థ వెల్లడించింది. కాగా బయటకు దూకిన ఐదుగురిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని అల్- హమ్నా ఆసుపత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది సహాయంతో బస్సులో మంటలు ఆర్పివేశారు. మృతుల్లో ఏషియన్, అరబిక్‌కు చెందిన పౌరులు ఉన్నట్లు సౌదీ వార్త సంస్థ వెల్లడించింది. కాగా 2018 ఏప్రిల్‌లో మక్కాను సందర్శించుకోవడానికి బస్సులో 20 మంది యాత్రికుల బృందం బయలుదేరింది. సరిగ్గా మదీనాలోని అల్ అఖర్ ఫ్రావిన్స్ వద్దకు రాగానే ఆయిల్ ట్యాంకర్ పేలి 12 మంది తీవ్రంగా గాయపడ్డారని ఆ సంస్థ పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com