అంతర్జాతీయం

బ‌స్సులో చెలరేగిన మంటలు.. 35 మంది మృతి

బ‌స్సులో చెలరేగిన మంటలు.. 35 మంది మృతి
X

సౌదీ అరేబియాలోని మ‌దీనా స‌మీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విదేశీయుల‌తో వెళ్తున్న ఓ బ‌స్సు.. భారీ పొక్లెయినర్‌ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో బస్సు మొత్తానికి అవి వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో 35 మంది మృతి చెందగా.. మ‌రో న‌లుగురు తీవ్రంగా గాయపడ్డారు. యాక్సిడెంట్ తర్వాత వెంటనే మంటలు చెలరేగడం, అద్దాలు బద్దలుకొట్టుకుని ప్రయాణికులు బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో క్షణాల్లోనే అంతా ప్రాణాలు కోల్పోయారు. దట్టమైన పొగకు ఊపిరాడక.. అగ్నికీలల కారణంగా సజీవ దహనం అయ్యారు.

సౌదీ అరేబియాలోని మ‌క్కా నుంచి మ‌దీనా వెళ్లే రోడ్డులో అల్ అఖల్ సెంటర్ సమీపంలో ఈ ప్రమాదం జ‌రిగింది. గాయ‌ప‌డ్డవారిని స్థానికంగా ఉన్న అల్ హమ్నా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందినవారిలో ఆసియా, అర‌బ్ దేశాల యాత్రికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Next Story

RELATED STORIES