ఆమె పిలిస్తే వెళ్లాల్సిందే.. లేకపోతే..

ఆమె పిలిస్తే వెళ్లాల్సిందే.. లేకపోతే..

మంచు ముత్యం లక్ష్మి.. తెలుగును ఇంగ్లీష్ యాక్సెంట్‌లో మాట్లాడుతూ అందర్నీ ఆకర్షిస్తుంది. మోహన్ బాబు ముద్దుల కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా సినిమాల్లోని పలు పాత్రలతో అభిమానులను ఆకట్టుకుంది. బుల్లితెరపై కొన్ని కార్యక్రమాలు చేస్తూ అభిమానులకు మరింత దగ్గరైంది. ప్రేమతో మీ లక్ష్మీ అంటూ సెలబ్రెటీల మనోగతాలను బుల్లి తెరపై ఆవిష్కరించింది. మేము సైతం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి సాయపడింది. ఇందులో కూడా సెలబ్రెటీలను ఇన్వాల్వ్ చేసింది. నిర్మాతగా, వ్యాఖ్యాతగా మంచి పేరు తెచ్చుకుంటున్న మంచు లక్ష్మి తాజాగా వస్తున్న షో ద్వారా ఈ సారి తన పంథాను మార్చుకున్నట్లు తెలుస్తోంది.

ఓ కొత్త కాన్పెప్ట్‌తో అభిమానులను అలరించనుంది. సెలబ్రెటీల బెడ్రూమ్ ముచ్చట్లను తెరపైకి తీసుకువస్తోంది. ఈ షోలో ఇప్పటి వరకు సమంత, రకుల్, శ్రుతి హాసన్ పాల్గొన్నారు. తాజాగా హీరో నిఖిల్‌కి కూడా మంచు లక్ష్మీ నుంచి కాల్ వచ్చింది. ఉన్న పళంగా నైట్ డ్రెస్ వేసుకుని రమ్మనే సరికి రెక్కలు కట్టుకుని ఆమె ముందు వాలిపోయాడు నిఖిల్. ఇదే విషయాన్ని నిఖిల్ చెబుతూ ఆమె పిలిస్తే యంగ్ హీరోలు ఎవరైనా వెళ్లాల్సిందే.. లేకపోతే కైమా కొట్టేస్తుంది అని ఫన్నీగా కామెంట్ చేశాడు. నైట్ డ్రెస్ వేసుకుని నిఖిల్ తన బెడ్ రూమ్ ముచ్చట్లను మంచు లక్ష్మితో పంచుకున్నాడు. మరి ఆ ముచ్చట్లేవో వినాలని బుల్లితెర ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ షోలో పాల్గొన్న నిఖిల్ తన మనసులో ఉన్న ఆరాధ్య దేవత, తను ప్రేమిస్తున్న అమ్మాయి గురించి కూడా వివరించాడు. తను డాక్టర్.. చాలా మంచి అమ్మాయి అని మాత్రం చెప్పేశాడు.

Tags

Read MoreRead Less
Next Story