నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఎస్పీడీసీఎల్‌లో 3025 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఎస్పీడీసీఎల్‌లో 3025 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్పీడీసీఎల్ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. 3వేల 25 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. మూడు క్యాటగిరీల్లోని పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. జూనియర్ లైన్‌మెన్ పోస్టులు 2,500, జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు 500, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టులు 25.. మొత్తం 3 వేల 25 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. జేపీవో ఉద్యోగాలకు ఏదైనా యూనివర్సిటీ నుంచి బీఏ లేదా బీఎస్సీ, బీకామ్ పూర్తిచేసినవారు అర్హులు. జేఎల్ఎంకు దరఖాస్తు చేసేవారు పదోతరగతి ఉత్తీర్ణులై ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్/వైర్‌మెన్ లేదా ఇంటర్ వృత్తివిద్యలో రెండేళ్ల ఎలక్ట్రికల్ ట్రేడ్ పూర్తి చేసినవారు అర్హులు. విద్యుత్ సంస్థలోని ఆర్టిజన్లు/ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వయోపరిమితిలో మినహాయింపు ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి దరఖాస్తు గడువు నవంబర్ 20. కాగా, జేఎల్ఎం, జేపీవో ఉద్యోగాలకు డిసెంబర్ 15న పరీక్ష నిర్వహిస్తారు. జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకు డిసెంబర్ 22న పరీక్ష జరుగుతుంది. దరఖాస్తులను TS SOUTH POWER CGG.GOV.IN అనే వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి.

Tags

Read MoreRead Less
Next Story