ఈనెల 19 నుంచి క్యాబ్‌లు కూడా..

ఓ పక్క ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుండడంతో ప్రజలు ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటూ సమ్మె త్వరగా విరమించాలని కోరుకుంటున్నారు. తాజాగా క్యాబ్ డ్రైవర్లు కూడా సమ్మె చేయాలని నిర్ణయించుకున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ క్యాబ్ డ్రైవర్లు సమ్మె బాట పడుతున్నారు. ఈనెల 19 నుంచి నివరధిక సమ్మెకు వెళ్లనున్నారు. ఉబర్, ఓలా, ఐటీ కంపెనీలకు సేవలందిస్తున్న 50 వేల క్యాబ్‌లు సమ్మెలో పాల్గొంటాయని తెలంగాణ ట్యాక్సీ, డ్రైవర్స్ ఐకాస ఛైర్మన్ షేక్ సలావుద్దీన్ తెలిపారు. కిలోమీటరుకు కనీస రుసుము రూ.22 చేయాలన్న డిమాండ్‌తో సమ్మె చేయనున్నట్లు వెల్లడించారు. ఐటీ కంపెనీలతో అనుసంధానంగా పనిచేస్తున్న క్యాబ్ డ్రైవర్లకు జీవో నెం. 61,66 అమలు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. డ్రైవర్లపై దాడుల కేసులను పరిష్కరించేందుకు వినియోగదారుల కేవైసీ తప్పనిసరి చేయాలని కోరారు. క్యాబ్ డ్రైవర్ల సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com