ఆడపిల్లను అమ్మకానికి పెట్టిన తండ్రి

ఆడపిల్లను అమ్మకానికి పెట్టిన తండ్రి

ఆడ బిడ్డను భారంగా భావించాడో తండ్రి. పురిట్లో ఉండగానే అమ్మకానికి పెట్టేశాడు. ఏమాత్రం జాలి, దయ, కనికరం చూపలేదు. కృష్ణా జిల్లాలోని ఓ ఆస్పత్రిలో.. నూజివీడు మండలం కొత్తూరు తండాకు చెందిన రజిత.. వారం క్రితం కవలలకు జన్మనిచ్చింది. ఇద్దరు ఆడ పిల్లలు పుట్టడం ఇష్టం లేని తండ్రి.. 8 రోజుల పసిబిడ్డను బేరానికి పెట్టాడు. రూ. లక్షన్నరకు అమ్మేందుకు ప్రయత్నించాడు.

పసిబిడ్డను అమ్మేస్తున్నాడని తెలుసుకున్న అతని మామ.. అల్లుడు రాజేష్‌తో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య ఘర్షణ, తోపులాట చోటుచేసుకుంది. రాజేష్‌కు నాలుగేళ్ల క్రితం రజితతో వివాహం జరిగింది. తొలి కాన్పులో బాబు పుట్టాడు. మళ్లీ కొడుకు కావాలని అనుకున్న రాజేష్.. ఆడ కవల పిల్లలు పుట్టడంతో పసికందులను అమ్మకానికి పెట్టాడు.

Tags

Read MoreRead Less
Next Story