ప్రియురాలిని కొట్టి మూడో అంతస్తు పై నుండి తోసేసిన ప్రియుడు

ప్రియురాలిని కొట్టి మూడో అంతస్తు పై  నుండి తోసేసిన ప్రియుడు

వనస్థలిపురం వాసవీ కాలనీలో దారుణం జరిగింది. నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌ మూడో అంతస్థుపై నుండి ప్రియురాలి సీమను కొట్టి ఆమె ప్రియుడు దిలీప్‌ కిందకు తోసేశాడు. తీవ్ర గాయాల పాలై ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. పరారీలో ఉన్న దిలీప్‌పై కేసు నమోదు చేసుకుని పోలీసులు గాలిస్తున్నారు.

15 రోజుల కిందట మధ్యప్రదేశ్‌ నుంచి వచ్చిన దిలీప్‌, సీమలు వనస్థలిపురం శక్తి నగర్‌లోని వాసవి నిలియంలో భవనం నిర్మాణాల పనిలో చేరారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరగడంతోనే దిలీప్‌ హత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story