హువావే 'మేట్ ఎక్స్' మడతబెట్టే ఫోన్ స్పెషాలిటీ ఏంటో తెలుసా?

హువావే మేట్ ఎక్స్ మడతబెట్టే ఫోన్ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
X

ప్రస్తుతం నడుస్తున్న స్మార్ట్ ఫోన్ యుగంలో.. రోజుకో టెక్నాలజీతో మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి వివిధ కంపెనీల స్మార్ట్ ఫోన్లు. తాజాగా మడతబెట్టే స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లో హల్చల్ చేస్తున్నాయి. అయితే అన్ని షోరూం లలో ఈ ఫోన్లు అందుబాటులోకి ఇంకా రాలేదు. శాంసంగ్ ఇప్పటికే మడతబెట్టే స్మార్ట్ ఫోన్ల అమ్మకాలను మొదలుపెట్టగా.. ఇప్పుడు మరో ప్రముఖ కంపెనీ ఈ జాబితాలో చేరబోతోంది. చైనాకు చెందిన హువావే.. అతి త్వరలోనే 'మేట్ ఎక్స్' పేరుతో మడతబెట్టే ఫోన్ ను రిలీజ్ చేయబోతుంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫోన్ లో చిన్న చిన్న ఎర్రర్ లను గుర్తించింది. అతి త్వరలోనే వీటిని రెక్టిఫై చేయనుంది. ఇప్పటివరకు ఈ ఫోన్ నమూనాను మాత్రమే విడుదల చేసిన హువావే..

తాజాగా మడతబెట్టే ఫోన్ నే వీడియో రూపంలో ముందుకు తీసుకువచ్చింది. ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ 'మేట్ ఎక్స్' ఫోన్ యొక్క డిస్ప్లే ను ట్యాబ్ లాగ సన్నగా తయారు చేశారు. ఈ ఫోన్ ను మడతబెట్టి తిరిగి తెరిచేందుకు గాను ఓ బటన్ ను అమర్చారు. ఈ ఫోన్ డిస్ప్లే తెరిచినప్పుడు 8 అంగుళాలు, మూసినప్పుడు 6.6 అంగుళాలు ఉంటుంది. ఈ ఫోన్ కిందపడితే పగలకుండా ఉండేందుకు మాగ్నెటిక్ పౌచ్ ను కూడా ఉంచారు. ఆండ్రాయిడ్ 9పై ఓఎస్ తో ఉంటుంది. బ్యాటరీ సామర్ధ్యం 4500 ఎమ్ఏహెచ్, మూడు కెమెరాలు, ఇవి కూడా డిస్ప్లే వైపునకు ఉంటాయి. 8జీబీ ర్యామ్, 512 ఎంబీ ఇంటర్నల్ మెమరీతో ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుందని హువావే తెలిపింది.

Tags

Next Story