సంచలనం : ఢిల్లీ స్పీకర్‌కు ఆరు నెలల జైలు

సంచలనం : ఢిల్లీ స్పీకర్‌కు ఆరు నెలల జైలు
X

ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ రామ్‌ నివాస్‌ గోయెల్‌, అతని కుమారుడు సుమిత్‌ గోయెల్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 2015 లో తూర్పు ఢిల్లీ కాలనీలోని రియల్టర్ ఇంటిపై దాడి చేసిన ఘటనలో ఆయనపై నేరం రుజువైంది. ఈ క్రమంలో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సమర్ విశాల్ గోయెల్ మరియు మరో నలుగురు - సుమిత్ గోయల్, హితేష్ ఖన్నా, అతుల్ గుప్తా మరియు బల్బీర్ సింగ్లను దోషులుగా తేల్చారు.

ఒక్కొక్కరికి 1,000 రూపాయల జరిమానా విధించారు. అయితే, ఉన్నత న్యాయస్థానంలో అప్పీళ్లు దాఖలు చేయడానికి వీలు కల్పిస్తూ.. కోర్టు వారికి లక్ష రూపాయల బాండ్‌పై బెయిల్ మంజూరు చేసింది. 2015 ఫిబ్రవరి 6న స్పీకర్ రామ్‌ నివాస్‌ గోయెల్‌.. బిల్డర్ మనీష్ ఘాయ్ ఇంటికి వెళ్లి.. ఇంట్లోని పర్నీచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు అడ్డొచ్చిన పని మనుషులపై దాడి చేశారని ఆయనపై కేసు నమోదైంది.

Tags

Next Story