ఆర్టీసీ తాత్కాలిక మహిళా కండక్టర్‌పై డ్రైవర్‌ అత్యాచార యత్నం

ఆర్టీసీ తాత్కాలిక మహిళా కండక్టర్‌పై డ్రైవర్‌ అత్యాచార యత్నం

మంచిర్యాల జిల్లా జైపూర్‌ సమీపంలో ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్‌ దారుణానికి ఒడిగట్టాడు. తోటి తాత్కాలిక మహిళా కండక్టర్‌పై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ శ్రీనివాస్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మంచిర్యాల డిపోకు చెందిన బస్సులో శ్రీనివాస్‌ తాత్కాలిక డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అదే బస్సులో తాత్కాలిక కండక్టర్‌ గా మహిళ పనిచేస్తుంది. నిన్న రాత్రి జైపూర్‌ సమీపంలో బస్సులో ఎవ్వరు లేకపోవడంతో కామాంధుడు ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. అతన్ని తీవ్రంగా ప్రతిఘటించిన మహిళ అతని నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Tags

Read MoreRead Less
Next Story