ఆడపులి కోసం రెండు మగపులుల కొట్లాట

ఆడపులి కోసం రెండు మగపులుల కొట్లాట

ఒక అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు కొట్టుకోవడం చూసుంటాం. కానీ, జంతువులు కూడా అలా చేయడం ఎప్పుడైనా చూశారా..? రెండు మగ పులులు ఒక ఆడపులి కోసం భీకరంగా కొట్టుకోవడం ఎక్కడైనా గమనించారా..? రాజస్థాన్‌లోని రణతంబోర్ జాతీయ పార్కులో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఒక ఆడపులి కోసం రెండు మగ పులులు భయంకరంగా తలపడ్డాయి. పంజాలతో పరస్పరం దెబ్బతీయడానికి ప్రయత్నించాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సింగస్థ్, రాకీ అనే మగపులులు నూర్ అనే ఆడపులి కోసం గొడవకు దిగాయి. అది కాస్తా ముదిరి రెండు టైగర్లు కొట్టుకున్నాయి. ఒకదానిపై మరకొటి దాడి చేసు కున్నాయి. ఈ గొడవ జరుగుతుండగానే ఆడపులి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఐనప్పటికీ మగపులులు కొట్లాట ఆపలేదు. టైగర్ల ఫైటింగ్‌ను ఐఎఫ్‌ఎస్ అధికారి ప్రవీణ్ కస్వాన్‌ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. అది కాస్తా వైరల్‌గా మారడంతో టైగర్ల పోరులో ఎవరు గెలిచారో చెప్పాలని నెటిజన్లు ప్రవీణ్‌ను కోరారు. పులుల పోరాటం లో సింగస్త్ గెలిచిందని ప్రవీణ్ తెలిపారు. రెండు పులులకు ప్రమాదకర గాయాలు కాలేదని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story