బార్‌లో గొడవ.. బీరు సీసాతో పొడిచి..

బార్‌లో గొడవ.. బీరు సీసాతో పొడిచి..

వరంగల్‌ నగరంలో బార్‌లో జరిగిన గొడవ చివరకు హత్యకు దారి తీసింది. ఓ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. అల్లావుద్దీన్‌ అనే యువకుడు బార్‌లో మద్యం తాగేందుకు వెళ్లాడు. అదే సమయంలో నజీర్‌ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్నాడు. దీంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది. ఇది గమనించిన బార్‌ నిర్వహకులు.. ఇద్దరిని బయటకు పంపించేశాడు. ఇదే అదనుగా రెచ్చిపోయిన నజీర్.. తన దగ్గరున్న బీర్‌ సీసాతో అల్లావుద్దీన్‌ను విచక్షణ రహితంగా పొడిచాడు. దీంతో తీవ్ర గాయాలతో స్పాట్‌లోనే చనిపోయాడు అల్లావుద్దీన్‌.

అర్థరాత్రి 12 గంటల 45 నిమిషాల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యింది. నిందితుడు నజీర్‌పై మిల్స్‌ కాలనీ పోలీస్‌ స్టేషన్‌లో రెండు కేసులు నమోదై ఉన్నాయి. అతనిపై రౌడీ షీట్‌ తెరిచేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇది ప్రీప్లాన్‌ మర్డర్‌ కాదని.. మద్యం మత్తులోనే హత్యకు తెగబడ్డారని పోలీసులు చెబుతున్నారు. పరారైన నిందితుల కోసం గాలిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story