భర్తను బేరం పెట్టింది.. రూ.5లక్షలకు అమ్మేసింది..

భర్తను బేరం పెట్టింది.. రూ.5లక్షలకు అమ్మేసింది..
X

మా ఆయన నీకు నచ్చాడా.. నా తల్లే.. నా బంగారమే.. నేను కూడా ఎలా వదిలించుకోవాలా అని చూస్తున్నాను.. మంచి బేరమే దొరికింది.. సరే ఇంతకీ ఎంతకి కొంటావో చెప్పు.. రూ.5 లక్షలకు ఒకేనా.. డబ్బు కట్టి ఆయన్ని పట్టుకుపో.. ఏంటో మార్కెట్లో గొర్రెల బేరంలా సాగింది వాళ్లిద్దరి మధ్యా మాటల వ్యవహారం. అప్పుడెప్పుడో తెలుగులో ఎస్వీకృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన శుభలగ్నం సినిమాను తలపించింది ఈ ఘటన. కర్ణాటక మాండ్యా జిల్లాకు చెందిన ఓ వివాహిత భర్తకు రమ్య అనే యువతితో వివాహేతర సంబంధం ఉంది. భర్త ఈమధ్య క్యాంపులు ఉన్నాయంటూ తరచుగా ఊరెళ్లడాన్ని మొదట తేలిగ్గానే తీసుకున్నా ఎందుకో అతడిపై అనుమానం వచ్చింది. ఇంటికి వచ్చినా ముభావంగా ఉండడం, పిల్లలతో సరిగా గడపకపోవడాన్ని గమనిస్తూ వచ్చింది భార్య. అలా వారానికి 2,3 రోజులు పని ఉందంటూ వెళ్లిపోతున్నాడు.

ఏం జరుగుతోంది అసలు అని భర్తపై నిఘా పెట్టింది భార్య. ఆమె అనుమానం నిజమైంది. అతడు రమ్య అనే ఆవిడతో సన్నిహితంగా ఉంటున్నాడని తెలుసుకుంది. ఓ రోజు వాళ్లిద్దరూ ఏకాంతంగా ఉండడాన్ని చూసింది. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది ఇద్దరినీ. రమ్యతో.. సిగ్గులేదు పెళ్లయిన మగాడితో ఏంటీ వ్యవహారం అని నిలదీసింది. దాంతో రమ్య మీ ఆయన నాకు రూ.5 లక్షలు బాకీ ఉన్నాడంది. అది చెల్లించకపోవడంతో తన దగ్గరే ఉంచుకున్నానని చెప్పింది. మొత్తానికి ఆయన్ని నీ దగ్గరే ఉంచుకో.. అయితే ఓ షరతు.. అందుకుగాను నాకు రూ.5 లక్షలు ఇవ్వాలి అంది. డీల్ ఓకే అవడంతో రమ్య ఈ నెల 17న ఆమెకు డబ్బు చెల్లించింది. ఆయన కట్టిన తాళి కూడా ఇచ్చేయమని రమ్య అడిగేసరికి డబ్బు వచ్చిన ఆనందంలో తాళి కూడా తీసి ఇచ్చేసింది ఆ మహా ఇల్లాలు.

Tags

Next Story