చిన్నారి ప్రాణం తీసిన లిఫ్ట్‌

చిన్నారి ప్రాణం తీసిన లిఫ్ట్‌

హైద్రాబాద్‌ LBనగర్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని పిండి పుల్లారెడ్డి కాలనీలో విషాదం చోటు చేసుకుంది. 8 సంవత్సరాల చిన్నారి లాస్య ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు లిఫ్ట్ లో ఇరుక్కుని మృతి చెందింది. లిఫ్ట్‌లో ఇరుక్కున్నలాస్యను గుర్తించిన తల్లిదండ్రులు అతికష్టం మీద బయటికి తీశారు. వైద్యం కోసం హాస్పిటల్‌కి తరలించేలోపే చిన్నారి ప్రాణాలు విడిచింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కళ్ల ఎదుటే తమ కన్నపేగు ప్రాణాలు విడవడంతో గుండెలు అవిసేలా రోదిస్తున్నారు కుటుంబసభ్యులు.

Tags

Read MoreRead Less
Next Story