దీపావళి పండుగను సెలక్ట్ చేసుకున్న అల వైకుంఠపురములో

అల వైకుంఠపురములో...త్రివికమ్ర్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా ఇది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో ఇది హాట్రిక్ మూవీ. హారికా అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తోంది. సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా వస్తోంది.
భారీ అంచనాలున్న అల వైకుంఠపురములో నుంచి ఫస్ట్ సాంగ్ ఈ మధ్యే రిలీజైంది. తమన్ మ్యూజిక్ అందించగా, సిద్ శ్రీరామ్ పాడిన సామజవరగమన అనే పాట కొద్ది రోజులుగా ట్రెండింగ్ లో ఉంది. రిలీజైన మొదటి రోజు నుంచి యూట్యూబ్ లో ఈ సాంగ్ కి మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అందరి ఫోన్లలో ఈ పాటే రింగ్ టోన్. ఇప్పటికి ఈ సాంగ్ కి 40 మిలియన్ల వ్యూస్ దక్కాయి.
అల వైకుంఠపురములో టీమ్ త్వరలోనే రెండో సాంగ్ ని విడుదల చేయడానికి రెడీ అవుతోంది. ఫస్ట్ సాంగ్ క్లాస్ సాంగ్ అయితే, ఈ సారి మాస్ సాంగ్ ని వదలబోతున్నారు. అందుకే దీపావలి పండుగను కరెక్ట్ టైమ్ గా సెలక్ట్ చేసుకుంది టీమ్. ఈ సారి వచ్చే పాట మాస్ ని మైమరపిస్తుందంటున్నారు. మెగ్ ఫ్యాన్స్ ఆ పాట కోసం ఇప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com