ముంబై ఆర్బీఐ కార్యాలయం ముట్టడించిన డిపాజిటర్లు

ముంబై ఆర్బీఐ కార్యాలయం ముట్టడించిన డిపాజిటర్లు
X

పీఎంసీ బ్యాంకు స్కాంతో లక్షలాది ఖాతాదారుల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. న్యాయం కోసం దాదాపు 17 లక్షల మంది ఖాతాదారులు పోరాటం చేస్తున్నారు. ఆరు నెలల వరకు పీఎంసీ బ్యాంకుపై ఆంక్షలు విధించిన ఆర్బీఐ.. నగదు ఉపసంహరణ పరిమితిని 10 వేలుగా చేసింది. అంతే కాదు ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలను సైతం నిలిపివేసింది. దీంతో పీఎంసీ డిపాజిటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్బీఐ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న డిపాజిటర్లు.. ముంబై ఆర్బీఐ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. సేవ్‌ మీ, సేవ్‌ పీఎంసీ అంటూ నినాదాలు చేశారు.

ఇప్పటికే పీఎంసీ స్కాంతో ముగ్గురు ఖాతాదారులు తనువు చాలించగా.. తాజాగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు. 83 ఏళ్ల మురళీధర్ ధారా గుండెపోటుతో మరణించారు. మురళీధర్.. పీఎంసీ బ్యాంకులో 80 లక్షలు డిపాజిట్ చేశారు. క్లిష్టమైన గుండె ఆపరేషన్‌ కోసం కోసం వీటిని విత్‌డ్రా చేసుకుందామనుకుండగానే రిజర్వుబ్యాంక్ నియంత్రణ విధించడంతో.. తీవ్ర ఉద్రేగానికి గురైన ఆయన కన్నుమూశారు. దీంతో వారం వ్యవధిలో పీఎంసీ కేసులో చనిపోయిన వారి సంఖ్య నాలుగుకు చేరింది.

Tags

Next Story