కారుతో ట్రాఫిక్‌ ఎస్ఐను ఢీకొట్టిన మందు బాబు

కారుతో  ట్రాఫిక్‌ ఎస్ఐను ఢీకొట్టిన మందు బాబు

హైదరాబాద్ చాదర్‌ ఘాట్‌లో ఓ మందు బాబు కారుతో బీభత్సం సృష్టించాడు. బైక్‌పై వెళ్తున్న పంజాగుట్ట ట్రాఫిక్‌ ఎస్‌ఐ శ్రీనివాసులను కారుతో ఢీకొట్టాడు. దీంతో ఎస్‌ఐ శ్రీనివాసులుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ని మలక్‌పేట ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చాదర్‌ ఘాట్ పీఎస్‌ లిమిట్స్‌లోని మెరిడియన్‌ ఫంక్షన్‌ హాల్‌కు ఎదురుగా ఈ ప్రమాదం జరిగింది. ఎస్‌ఐను ఢీకొట్టిన కారు డ్రైవర్‌ అర్షద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story