ఒక్క పిలుపుతో వారిలో కొత్త ఉత్సాహం..

ఒక్క పిలుపుతో వారిలో కొత్త ఉత్సాహం..
X

ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఇంటిరీయర్‌ డిజైనింగ్‌ రంగాల్లోని ప్రతిభావంతులకు పట్టం కడతాం. మీరు చేయాల్సిందల్లా మీరు రూపొందించిన నిర్మాణాలకు సంబంధించిన ప్రొఫైల్‌ పంపడమే అంటూ ఇచ్చిన ఒక్క పిలుపు తెలుగు రాష్ట్రాల్లోని ఆర్కిటెక్ట్స్‌- ఇంటిరీయర్‌ డిజైనర్లకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. తమని సైతం గుర్తించబోతున్నారనే ఆనందం వారిలో కనిపించింది. నామినేషన్లకు స్వాగతం అంటూ ప్రకటించిన వెంటనే వచ్చిన స్పందన అద్భుతం. అపూర్వం. ఇది అతిశయోక్తి కాదు. మాకు వచ్చిన నామినేషన్లే ఈ విషయాన్ని నిరూపించాయ్‌.

అసలు మన దగ్గర ఎంతమంది ఆర్కిటెక్ట్స్‌- ఇంటిరీయర్‌ డిజైనర్స్‌ ఉన్నారు. వాళ్ల వరకు విషయం చేరుతుందా...? ఎంతమంది నామినేషన్లకు అప్లై చేస్తారు లాంటి అనుమానాలు మొదట్లో ఏ మూలో ఉండేవి. అయితే మావి కేవలం అనుమానాలేనని... ఎలాంటి అపోహలు అక్కర్లేదన్న భరోసా రావడానికి ఎంతో సమయం పట్టలేదు. జులై 21 ఉదయం పది గంటల నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. రోజు రోజుకి వచ్చే అప్లికేషన్ల సంఖ్య అంతకంతకూ పెరిగిపోయాయ్‌. కేవలం ఆంధ్రప్రదేశ్‌- తెలంగాణా నుంచే కాదు పక్క రాష్ట్రాల నుంచి సైతం పెద్ద సంఖ్యలో నామినేషన్లు పంపించారు.

ఇక వివిధ కేటగిరీలుగా విభజించి... కట్టడం పూర్తై మూడు సంవత్సరాలు దాటిన నిర్మాణాలను పరిగణనలోకి తీసుకుని నామినేషన్లను ఆహ్వానించడం జరిగింది. వాటిల్లో ఆర్కిటెక్చర్‌ విభాగం నుంచి అర్బన్‌ రెసిడెన్సీ, ఫార్మ్‌ హౌస్‌, హౌసింగ్‌ లేఔట్స్‌, ల్యాండ్‌స్కేప్స్‌, ఇనిస్టిట్యూషనల్‌ బిల్డింగ్‌, అర్బన్‌ డిజైన్‌ ప్రాజెక్ట్స్‌, గ్రీన్‌ ప్రాజెక్ట్స్‌కు చెందిన నిర్మాణాలు ఉన్నాయ్‌.

అలాగే ఇంటిరీయర్‌ డిజైన్‌ సెక్షన్‌లో రెండు వేల స్క్వేర్‌ఫీట్‌ లోపు, దాటిన రెసిడెన్స్‌ ఇంటిరీయర్స్‌, హాస్పిటల్‌ ఇంటిరీయర్స్‌, రిటైల్‌ ఇంటిరీయర్స్‌, ఇనిస్టిట్యూషనల్‌ ఇంటిరీయర్స్‌ను పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. ఈ కేటగిరీల్లో ఇళ్లు, ఫ్లాట్స్‌, కేఫేటేరియస్‌, రెస్టారెంట్‌, బార్‌ అండ్‌ పబ్‌, షోరూమ్స్‌- షాప్స్‌, ఆఫీస్‌లు, బ్యాంక్స్‌ ఉన్నాయ్‌.

అంతేకాదు విద్యార్థులను ప్రోత్సహించే ఉద్ధేశ్యంతో వారికి కూడా అవార్డ్‌ ఇవ్వాలని భావించాం. అందుకే ఎమర్జింగ్‌ ఆర్కిటెక్ట్స్‌ కేటగిరీ కింద జ్యురీ ఎంపిక చేసిన వారికి స్టూడెంట్‌ డిజైన్‌ ప్రాజెక్ట్‌కు అవార్డ్‌ దక్కనుంది. ఇక ప్రత్యేక శైలితో ఆకట్టుకునే నిర్మాణాలను స్ట్రక్చరల్‌ డిజైన్‌ కేటగిరీ కింద పరిగణించి వాటికి కూడా నామినేషన్లను ఆహ్వానించడం జరిగింది.

వీటితో పాటు ఊహలు, కల్పనకు కళాత్మకతను జోడించి తమ సుదీర్ఘ ప్రయాణంలో నిర్మాణ రంగంలో అద్భుతాలు సృష్టించిన డిజైనర్లను గౌరవించడం సముచితం అన్న భావనకు కూడా రూపం ఇచ్చాం. అందుకే దశాబ్దాల అనుభవం ఉండి సూపర్ సక్సెస్ అయిన ఇద్దరు సీనియర్‌ ఆర్కిటెక్టులకు లైఫ్‌టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డులను కూడా ఈ సందర్భంగా ఇవ్వబోతోంది టీవీ5.

Tags

Next Story