బోటును వెలికి తీసేందుకు వారిని రంగంలోకి దించిన ధర్మాడి సత్యం..

బోటును వెలికి తీసేందుకు వారిని రంగంలోకి దించిన ధర్మాడి సత్యం..
X

కచ్చులూరులో బోటు చిక్కినట్టే చిక్కి పట్టు జారుతోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతుండడంతో.. ధర్మాడి సత్యం గజ ఈతగాళ్ల బృందాన్ని రంగంలోకి దించారు. కచ్చులూరులో బోటు వెలికి తీసేందుకు విశాఖ నుంచి 10 మంది గజ ఈతగాళ్లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వీరు గోదావరి నదీ గర్భంలోకి వెళ్లి.. బోటుకు లంగరు వేసి బయటకు తీయనున్నారు. అయితే జిల్లా కలెక్టర్‌ అనుమతి కోసం దేవిపట్నం వద్ద వేచి చూస్తున్నారు.

గత నాలుగైదు రోజులుగా చేస్తున్న ఆపరేషన్ వశిష్టలో కొంత పురోగతి కనిపించింది. లంగర్‌కు బోటు చిక్కినట్టే చిక్కి పట్టు తప్పి పోయింది. దానికి సంబంధించిన కొన్ని శకలాలు మాత్రం ధర్మాడి బృందం బయటకు తీసి కొంత మేర విజయం సాధించింది. తాజాగా గజ ఈతగాళ్లను నదిలోకి దించితే బోటు పూర్తిగా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు ధర్మాడి సత్యం.

Tags

Next Story