సిక్స్‌ కొట్టి డబుల్ సెంచరీ పూర్తి చేసిన హిట్‌మ్యాన్‌

సిక్స్‌ కొట్టి డబుల్ సెంచరీ పూర్తి చేసిన హిట్‌మ్యాన్‌

సూపర్‌ ఫామ్‌లో దూసుకుపోతున్న హిట్ మ్యాన్‌ రోహిత్ శర్మ.. రాంచీ టెస్ట్‌లో దుమ్మురేపాడు. డబుల్‌ సెంచరీతో కదం తొక్కాడు. సిక్స్‌ కొట్టి తన టెస్ట్‌ కెరీర్‌లోనే తొలి డబుల్ సెంచరీ నమోదు చేశాడు. 250 బంతుల్లో 28 ఫోర్లు, 5 సిక్సులతో కొట్టి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్‌ను రోహిత్‌ ఆదుకున్నాడు. దూకుడుగా ఆడుతూ రహనేతో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రోహిత్‌ దూకుడుతో భారత్‌ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. అయితే 212 పరుగుల వద్ద రబడా వేసిన బాల్‌ను సిక్సుగా మలిచే క్రమంలో క్యాచ్‌ ఔట్‌ అయ్యాడు రోహిత్‌.

ఇటీవల టీమిండియా ఓపెనర్‌ పాత్రలో అరంగేట్రం చేసిన రోహిత్‌ శర్మ.. రికార్డులు మీద రికార్డులు కొల్లగొడుతున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే మూడు సెంచరీలను సాధించిన రోహిత్‌ శర్మ.. చివరి టెస్టులో డబుల్‌ సెంచరీ చేసి తన సత్తా ఏంటో నిరూపించాడు. టెస్టు ఫార్మాట్‌లో ఓపెనర్‌గా పనికి రావన్న విమర్శకులకు బ్యాట్‌తోనే సమాధానం చెబుతున్నాడు. ఇప్పటివరకూ ఈ సిరీస్‌లో రోహిత్‌ శర్మ 500కు పైగా పరుగులు సాధించాడు. దాంతో ఒక సిరీస్‌లో ఐదు వందలకు పైగా పరుగులు సాధించిన ఐదో భారత్‌ ఓపెనర్‌గా అరుదైన ఘనతను నమోదు చేశాడు రోహిత్‌.

Tags

Read MoreRead Less
Next Story