20 Oct 2019 6:02 AM GMT

Home
 / 
అంతర్జాతీయం / కొట్టుకుపోయిన డ్యామ్.....

కొట్టుకుపోయిన డ్యామ్.. 15 మంది మృతి

కొట్టుకుపోయిన డ్యామ్.. 15 మంది మృతి
X

రష్యాలోని సైబీరియా వద్ద నిర్మించిన డ్యామ్ కొట్టుకుపోవడంతో 15మంది మరణించారు. మరో ఆరుగురు గల్లంతయ్యారు. క్రాస్నోయార్స్ లో ఉన్న బంగారు గని వద్ద సైబా నదిపై చట్టవిరుద్దంగా నిర్మించిన డ్యామ్ కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. డ్యామ్ కొట్టుకుపోవడంతో వరద పోటెత్తి సమీప ప్రాంతాలను ముంచేసింది. కాలనీలు, ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. దీంతో ఆరు హెలికాప్టర్లు, పడవల సహాయంతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఈ డ్యామ్ గురించి తమకు ఇప్పటివరకు తెలియదని అధికారులు అంటున్నారు. అయితే ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story