హోంగార్డులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ సీఎం

హోంగార్డుల వేతనాలను రూ.18 వేల నుంచి 21 వేలకు పెంచుతున్నట్లు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఈరోజు ఉదయం విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాత్రి పగలు తేడాలేకుండా విధులు నిర్వహించే పోలీసులు బాధ్యతల నిర్వహణలో ఒక్కోసారి ప్రాణాలు కోల్పోతుంటారని అన్నారు. అటువంటి వారి త్యాగాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని ఆయన అన్నారు. విధినిర్వహణలో మరణించిన హోంగార్డుల కుటుంబాలకు రూ.5లక్షల నష్టపరిహారం అందిస్తామని జగన్ వివరించారు. విరామం లేకుండా విధులు నిర్వహించే హోంగార్డులు వారానికి ఒక్కరోజైనా వారి కుటుంబాలతో సంతోషంగా గడిపేందుకు వీలుగా వీక్లీ ఆఫ్‌లు కల్పించామని అన్నారు. అంతేకాకుండా పోలీస్ సిబ్బందికి రూ.40లక్షలు బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. రిటైర్డ్ పోలీసులకు కూడా బీమా వర్తిస్తుందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com