రాయల్ వశిష్ట బోటు వద్దకు వెళ్లిన డైవర్లు.. బోటు టాప్ అంతా..

రాయల్ వశిష్ట బోటు వద్దకు వెళ్లిన డైవర్లు.. బోటు టాప్ అంతా..
X

ఆపరేషన్ రాయల్ వశిష్ట మళ్లీ ఫెయిల్ అయింది. విశాఖ నుంచి వచ్చిన డైవర్స్ నది అడుగుభాగంలోకి వెళ్లి..పడవకు రోప్‌లు బిగించి వచ్చారు. పైకి లాగుతున్న క్రమంలో ఆ బరువును రోప్‌లు తట్టుకోలేకపోయాయి. దీంతో కేవలం పడవ పైభాగం మాత్రమే బయటకి వచ్చింది. మూడు రోజుల క్రితం బోటు రెయిలింగ్ ఊడిరాగా.. ఇప్పుడు టాప్‌ ఊడొచ్చింది...

లంగర్ల ద్వారా బోటును బయటకు తీసేందుకు ధర్మాటి సత్యం టీమ్ గత కొన్ని రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో విశాఖ నుంచి శివశక్తి అండర్ వాటర్ సర్వీసెస్‌కు చెందిన 10 మంది డైవర్లను పిలిపించారు.. వీళ్లు ఆదివారం ఉదయం గోదావరిలో అడుగు భాగానికి వెళ్లారు. ఆ ప్రాంతంలో బోటు ఎలా ఉంది.. దాని చుట్టూ ఇసుక, మట్టి ఎంత పేరుకుపోయాయి.? బోటుకు ఎక్కడ తాడు బిగిస్తే పైకి లాగొచ్చు అనే అంశాలన్నింటినీ పరిశీలించారు..

సోమవారం మరోసారి నాగరాజు, స్వామి అనే ఇద్దరు డైవర్లు గోదావరి అడుగుభాగంలో వెళ్లి.. బోటుకు రెండు రోప్‌లు బిగించారు... నదిలో నీటిమట్టం 40 అడుగుల స్థాయిలోనే ఉండటం.. సుడిగుండాలు కూడా లేకపోవడంతో బోటును సులభంగా బయటకు తీయొచ్చని భావించారు.. కానీ చిక్కినట్లే చిక్కి మరోసారి జారిపోయింది పడవ. ప్రస్తుతం రాయల్ వశిష్ట బోటు ముందుభాగం 40 అడుగుల లోతులే ఉంటే... వెనుకభాగం దాదాపు 70 అడుగుల లోతులో ఉంది.. బోటు ఏటవాలుగా నీటిలో మునిగిపోయింది.. వెనుకభాగం మొత్తం ఇసుకలో కూరుకుపోయింది.

Tags

Next Story