'సైరా నరసింహా రెడ్డి' 18 రోజుల వసూళ్లు

సైరా నరసింహా రెడ్డి 18 రోజుల వసూళ్లు
X

మెగాస్టార్ చిరంజీవి, ఊర మాస్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన సినిమా 'సైరా నరసింహారెడ్డి' గాంధీ జయంతి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలిరోజు నుంచే హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో సినిమాకు భారీ కలెక్షన్లే వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 229 కోట్ల గ్రాస్ ను .. 140 కోట్ల షేర్ ను రాబట్టింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో 18 రోజుల్లో 104 కోట్ల షేర్ ను సాధించింది. ఒక్క నైజామ్ ఏరియాలోనే ఈ సినిమా 32 కోట్లకి పైగా వసూలు చేయడం విశేషం.

ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన 'సైరా'ను తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరించారనే చెప్పాలి. ఒక్క తెలుగులోనే 100 కోట్లకు పైగా షేర్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. మెగాస్టార్ నటన, బలమైన తారాగణం, గొప్ప స్టోరీ కావడంతో ప్రేక్షకులు సైరాకు బ్రహ్మరధం పట్టారు.

Tags

Next Story