డిగ్రీ అర్హతతో సుప్రీం కోర్టులో ఉద్యోగాలు.. అప్లైకి ఆఖరు ఈనెల..

భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ (SPA), పర్సనల్ అసిస్టెంట్ (PA) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. SPA పోస్టుకు కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. PA పోస్టుకు అనుభవం అవసరం లేదు. సుప్రీం కోర్టు అధికారిక వెబ్‌సైట్ sci.gov.in లో నోటిఫికేషన్ వివరాలు చూడొచ్చు. దరఖాస్తుకు ఆఖరు తేదీ అక్టోబర్ 24.
మొత్తం పోస్టులు :58
అర్హత: ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. నిమిషానికి 40 పదాల టైపింగ్ స్పీడ్ ఉండాలి. ఇంగ్లీషులో నిమిషానికి 110 పదాల షార్ట్ హ్యాండ్ స్పీడ్ ఉండాలి.
వయసు: SPA పోస్టుకు 32 ఏళ్లు, PA పోస్టుకు 27 ఏళ్లు ఉండాలి.
ఖాళీలు.. SPA పోస్టులు : 35.. PA పోస్టులు : 23.. దరఖాస్తు ప్రారంభం: 2019 సెప్టెంబర్ 28
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 అక్టోబర్ 24
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com