బేగంపేట మెట్రోస్టేషన్‌ మూసివేత..

బేగంపేట మెట్రోస్టేషన్‌ మూసివేత..

అసలే ఆర్టీసీ బస్సులు నడవక ప్రజలు నానా ఇబ్బందులు పడి ఎలాగో గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. కొంతలో కొంత నగరవాసులను మెట్రో ఆదుకుంటుంది కదా అనుకుంటే ఈ రోజు ప్రగతి భవన్ ముట్టడి ఉందంటూ కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చింది. దీంతో భద్రత కారణాల దృష్ట్యా బేగంపేట మెట్రోస్టేషన్ మూసివేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. ఈ మేరకు ముందస్తు సమాచారాన్ని ప్రయాణీకులకు తెలియజేస్తూ టికెట్ బుకింగ్ సెంటర్ల వద్ద ప్రతి మెట్రో స్టేషన్లో నోటీసులు అంటించారు. అక్కడ స్టాప్ లేకపోవడంతో బేగంపేట ఏరియాలో ఆఫీసులకు వెళ్లేవాళ్లు, ఇతర పనులు ఉన్నవాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ప్రగతి భవన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతను పెంచారు అధికారులు. భారీగా పోలీస్ బలగాలు మోహరించారు. దీంతో కార్యాలయాలకు, ఇతర పనులకు బయటకు వెళ్లేవారు పలు ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఆ ఏరియాలో ట్రాఫిక్ జామ్ అయి వాహనాల కదలిక నత్తనడకగా సాగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story