ఆ రెండూ కూల్చేశారు.. భారత్ భారీ విజయం

ఆ రెండూ కూల్చేశారు.. భారత్ భారీ విజయం

నాల్గో టెస్టులో టీమిండియా భారీ ఇన్నింగ్స్ విజయాన్ని నమోదు చేసింది. 202 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రీకాను చిత్తు చేసింది. నిజానికి భారత పేసర్లు షమీ, ఉమేశ్‌లు ఆఖరి టెస్టును మూడో రోజే తేల్చేశారు. ఇద్దరు సీమర్లు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఐదేసి వికెట్లు పడేశారు. తొలి సెషన్‌లో పేసర్లు ఉమేశ్‌ (3/40), షమీ (2/22)లకు స్పిన్నర్లు జడేజా (2/19), నదీమ్‌ (2/22) తోడయ్యారు. దీంతో సఫారీ తొలి ఇన్నింగ్స్‌ 56.2 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. హమ్జా (79 బంతుల్లో 62; 10 ఫోర్లు, 1 సిక్స్‌) ఒంటరి పోరాటం చేసినా ఫాలోఆన్ నుంచి తప్పించలేకపోయాడు..

ఈ క్రమంలో భారత పేసర్లు ఫాలోఆన్‌లో మరింత రెచ్చిపోయారు. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ను నిట్ట నిలువునా కూల్చేశారు. సోమవారం ఆటనిలిచే సమయానికి 132 పరుగులకే 8 వికెట్లను లేపేశారు.. ఆ తరువాత నదీమ్, అశ్విన్ మిగిలిన రెండు వికెట్లను తీసి పని పూర్తి చేశారు. దాంతో భారత్ భారీ ఇన్నింగ్స్ విజయం సాధించింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో కేవలం 10 పరుగులే ఇచ్చిన షమీ 3 వికెట్లు తీయగా, ఉమేశ్‌, నదీమ్ చెరి 2 వికెట్లు తీశారు. అశ్విన్, జడేజా తలో వికెట్ తీశారు. కాగా ఈ విజయంతో క్లీన్‌స్వీప్‌కు చేసినట్లయింది. మూడో టెస్టులో ఒక్క మూడో రోజే 16 వికెట్లతో ఘనచరితకు శ్రీకారం చుట్టడం విశేషం.

Tags

Read MoreRead Less
Next Story