శ్రీశైలం జలాశయంలోకి భారీ వరద.. గేట్లు ఎత్తేస్తారా?

శ్రీశైలం జలాశయంలోకి భారీ వరద.. గేట్లు ఎత్తేస్తారా?
X

కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి.. శ్రీశైలం జలాశయంలోకి వరద పోటెత్తుతోంది.. పశ్చిమ కనుమల్లో కురిసిన భారీ వర్షాలతో ఎగువ నుంచి వరద ప్రవాహం మరింత పెరిగింది.. తుంగభద్రలోనూ వరద ప్రవాహం పెరిగింది.. ఈ నీరంతా దిగువకు విడుదల చేస్తుండటంతో శ్రీళైలం దగ్గర కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.. మంగళవారం రెండు లక్షల క్యూసెక్కులకుపైగా వరదనీరు శ్రీశైలం రిజర్వాయర్‌కు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.. ఈ ప్రవాహం నెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉందంటున్నారు.. సోమవారం సాయంత్రం శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర ఇన్‌ఫ్లో 60వేల క్యూసెక్కులుగా నమోదైంది.. ప్రస్తుతం జలాశయంలో 209.16 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వరద ఉధృతి పెరిగితే మరోసారి ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉంది.

Tags

Next Story