హెచ్చరిక.. ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు

హెచ్చరిక.. ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు
X

ఏపీలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలపై ప్రభావం ఎక్కువగా ఉంది. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనూ వానలు పడుతున్నాయి. పలుజిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఎగువప్రాంతాల్లో కూడా జోరుగా వానలు పడుతుండటంతో కృష్ణా నదికి మరోసారి వరద వస్తోంది. ఇప్పటికే తుంగభద్ర జలాశయం గేట్లను ఎత్తివేశారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ వెల్లడించింది. పలు చోట్ల పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Tags

Next Story