తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు చట్టబద్ధంగా జరగడం లేదంటూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో.. త్వరలో ఎన్నికలకు మార్గం సుగమమైంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం గతంలోనే కోర్టుకు తెలిపింది. నిబంధనలకు లోబడే వార్డుల విభజన, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశామని వివరించింది. ఐతే.. ఓటర్ల జాబితా, వార్డుల విభజన విషయంలో పిటిషనర్ కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారు.
దీనిపై సుదీర్ఘ వాదనల తర్వాత కోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ వివరణతో సంతృప్తి చెంది.. ఎన్నికల నిర్వహణకు సరేనంది. ఇవాళ్టి కోర్టు తీర్పు నేపథ్యంలో.. త్వరలోనే 53 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఐతే.. ప్రస్తుతం మరో 75 మున్సిపాలిటీల విషయంలో స్టే ఉన్న నేపథ్యంలో అవి క్లియర్ అయ్యే వరకూ వాటిల్లో అక్కడ ఎలక్షన్స్ జరిగే పరిస్థితి లేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com