వింత ఘటన.. బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన విమానం

ఓ విమానం బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది. ఈ వింత ఘటన చైనాలో చోటు చేసుకుంది. హార్బిన్ నగరంలో ఓ విమానాన్ని పెద్ద ట్రక్కుపై తరలిస్తున్నారు. ఇతర వాహనాలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఆ ఫ్లైట్ రెక్కలు తొలగించారు. ఐతే, దురదృష్టవశాత్తూ ఆ విమానం ఓ వంతెన కింద ఇరుక్కుపోయింది. దాంతో ఆ ఫ్లైట్ నుంచి బ్రిడ్జ్ కింద నుంచి బయటకు తీయడానికి ఆపసోపాలు పడ్డారు.
బ్రిడ్జ్ కింద ఇరుక్కుపోయిన విమానాన్ని బయటకు తీయడానికి నానా కష్టాలు పడాల్సి వచ్చింది. ముందుగా డ్రైవర్లు, ట్రక్కు టైర్లలో గాలిని కొంచెం తగ్గించారు. దాంతో ట్రక్కు ఎత్తు కొంచెం తగ్గింది. ఆ తర్వాత నెమ్మదిగా వాహనాన్ని కొంచెం ముందుకు కదలించారు. ఎట్టకేలకు బ్రిడ్జి కింద నుంచి వాహనం బయటికి వచ్చింది. ఆ తర్వాత టైర్లలో మళ్లీ గాలి నింపి విమానాన్ని అక్కడి నుంచి తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com