ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ అల్లుడు

ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ అల్లుడు
X

కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఆస్పత్రిలో చేరారు. నోయిడాలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో వాద్రాకు చికిత్స అందిస్తున్నారు. ఆయన వెన్ను నొప్పి సహా కీళ్లకు సంబంధించిన సమస్యలతో బాధ పడుతున్నట్లు సమాచారం. ఆర్థోపెడిక్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన సర్జన్లు గత రాత్రి వాధ్రాకు ట్రీట్‌మెంట్ ఇచ్చా రు.

రాబర్ట్ వాద్రా సోమవారం మధ్యాహ్నం ఆస్పత్రికి వెళ్లారు. ఆయన వెంట భార్య ప్రియాంక వాద్రా కూడా ఉన్నారు. ట్రీట్‌మెంట్‌ నేపథ్యంలో వాద్రా కాలికి బ్యాండే జ్ వేశారు. ప్రస్తుతం వాద్రా నోయిడా ఆస్పత్రిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.

Tags

Next Story