23 Oct 2019 11:53 AM GMT

Home
 / 
అంతర్జాతీయం / దారుణం.. ట్రక్కులో 39...

దారుణం.. ట్రక్కులో 39 మృతదేహాలు

దారుణం.. ట్రక్కులో 39 మృతదేహాలు
X

truck

బ్రిటన్‌లో ఒళ్లు గగుర్పొడిచే పరిణామం సంభవించింది. ఓ ట్రక్కులో 39 మృతదేహాలు బయటపడ్డాయి. సౌత్ ఈస్ట్ ఇంగ్లండ్‌ ఎసెక్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తనిఖీ చేస్తుండగా ట్రక్కు కంటైనర్‌లో 39 డెడ్‌ బాడీలను గుర్తించారు. అది చూసి పోలీసు యంత్రాంగమే నివ్వెరపోయింది. ఆ మృతదేహాలెవరివో..? ఎందుకు తీసుకు వెళ్తున్నారో పోలీసు వర్గాలు ఆరా తీస్తున్నాయి.

మరోవైపు, ఈ ఘటనకు సంబంధించి లండన్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తర ఐర్లండ్‌కు చెందిన 25 ఏళ్ల యువకున్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అలాగే, ట్రక్కు ప్రయాణించిన మార్గాన్ని కూడా గుర్తించారు. ఆ ట్రక్కు, బల్గేరియా నుంచి హోలీహెడ్‌లోని వేల్ష్ టౌన్ ద్వారా ప్రయాణించినట్లు గుర్తించారు.

Next Story