కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌కు ఊరట

కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌కు ఊరట
X

dk-shivakumar

కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌కు ఊరట లభించింది. ఆయనకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 25 లక్షల రూపాయలు పూచీకత్తు చెల్లించాలని ఆదేశించిన హైకోర్టు, దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. దాదాపు 50 రోజుల తర్వాత డీకేకు బెయిల్ లభించింది. ప్రస్తుతం తీహా ర్ జైల్లో ఉన్న డీకే, బెయిల్‌పై త్వరలో విడుదల కానున్నారు.

డీకే శివకుమార్‌పై చాలా ఆరోపణలున్నాయి. 2017 ఆగస్టులో శివకుమార్‌ ఇంటి నుంచి 20 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. ఆ క్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. హవాలా మార్గంలో కోట్లాది రూపాయలను బెంగళూరు, ఢిల్లీలో దాచారంటూ ఈడీ అధికారులు, డీకేఎస్‌ను టార్గెట్ చేశారు. డీకే శివకుమార్, సచిన్ నారాయణ్, ఆంజనేయ హనుమంతయ్య, రాజేంద్ర న్‌లపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వరుసగా ఐదు రోజులు ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు సెప్టెంబర్ మూడో తేదీన డీకేను అరెస్టు చేశారు.

మనీలాండరింగ్ మంటలు డీకే కుటుంబాన్ని కూడా తాకాయి. ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు, డీకే కుమార్తె ఐశ్వర్యను ప్రశ్నించారు. ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో విచారణ జరిగింది. డీకేను కూడా ఈడీ అధికారులు విచారించారు. ఐశ్వర్యపై వంద కోట్ల మేర ఆస్తులున్నాయి. 2013లో కోటి రూపాయలుగా ఉన్న ఆస్తి 2018 నాటికి వంద కోట్లకు పెరిగింది. ఈ వ్యవహారంలో అవకతవకలు ఏమైనా జరిగాయా..? మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా..? అని ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. 2017 జులైలో డీకే, ఐశ్వర్యలు సింగపూర్‌లో పర్యటించారు. అక్కడ పెట్టుబడులు పెట్టారు. ఈ వ్యవహారంపై కూడా ఈడీ కూపీ లాగుతోంది.

Tags

Next Story