పెళ్లై నలుగురు పిల్లలున్నా.. ఆయనపైకే నా మనసు..

పెళ్లై నలుగురు పిల్లలున్నా.. ఆయనపైకే నా మనసు..

hema1

బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలిని పెళ్లై నలుగురు పిల్లలున్నా నటుడు ధర్మేంద్రపై మనసు పడింది. ఎందుకో ఆయన్ని చూడగానే సొంత మనిషిలా అనిపించారు. ఆ క్షణంలోనే ఆయన్ని సొంతం చేసుకోవాలనుకున్నాను. అయితే మొదటి భార్యనుంచి, ఆమె పిల్లలనుంచి అతడిని దూరం చేయాలనే ఉద్దేశం అసలు లేదు. అందుకే ఆ విషయాల్లో నేను తల దూర్చను అని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హేమామాలిని పేర్కొన్నారు. ఎంపీగా ఉన్న తాను ఇక రాజకీయ జీవితం చాలించి కుటుంబంతో సంతోషంగా గడపాలనుకుంటున్నట్లు చెప్పారు. ధర్మేంద్ర, హేమామాలిని కలిసి షోలే, సీతా ఔర్ గీతా చిత్రాల్లో నటించారు. వారి మధ్య అప్పుడే ప్రేమకు బీజం పడింది. వివాహబంధంతో ఒక్కటవ్వాలనుకున్నారు. 1979 ఆగస్టులో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఈషా, అహనా అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 19 ఏళ్ల వయసున్నప్పుడు 1954లో ప్రకాష్ కౌర్‌తో వివాహం జరిగింది. వీరికి సన్నీ డియోల్, బాబీ డియోల్, విజేతా, అజేత అని నలుగురు పిల్లలు ఉన్నారు. సన్నీ డియోల్, బాబీ డియోల్ తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని సినిమాల్లో రాణిస్తున్నారు.

Read MoreRead Less
Next Story