క్షుద్రపూజలు కలకలం.. గ్రామస్తుల ఆందోళన

క్షుద్రపూజలు కలకలం.. గ్రామస్తుల ఆందోళన
X

tantrik--pooja-in-nellore

నెల్లూరు జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. ఏఎస్‌పేట మండలం రాజవోలు శివార్లలో క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కుంకుమచల్లి కర్పూరం వెలిగించారు. నిమ్మకాయలు, కొబ్బరికాయలతో పాటు నాలుగు దిక్కుల్లోనూ కోళ్లను బలి ఇచ్చిన దృశ్యాలు భయంకరంగా ఉన్నాయి.

ఇదే ప్రాంతంలో ఒక పూలదండ కూడా ఉండటంతో కోళ్లతోపాటు నరబలి కూడా చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాజవోలు శివారు ప్రాంతంలోని ఈ క్షుద్రపూజల ఆనవాళ్లను పశువుల కాపరులు గుర్తించారు.

Tags

Next Story