బైపోల్‌లో బీజేపీ సీటును కొల్లగొట్టిన ఎంఐఎం

అక్టోబర్ 24న మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలతోపాటు.. 16 రాష్ట్రాల్లో 51 అసెంబ్లీ స్థానాలకు, 2 పార్లమెంట్ స్థానాలకు కౌంటింగ్ జరిగింది. 51 చోట్ల బైపోలస్‌లో 30 చోట్ల NDA విజయం సాధించగా.. కాంగ్రెస్ ఖాతాలో 12 సీట్లు, 8 చోట్ల ప్రాంతీయ పార్టీల గెలిచాయి. ఉత్తరప్రదేశ్, బీహార్‌లో మొత్తం 16 స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. యూపీలోని ప్రస్తుతం ఎన్నికలు జరిగిన 11 సీట్లలో 8 బీజేపీ సీట్లు కాగా, ఒకటి మిత్రపక్షానికి చెందిన స్థానం. వీటిల్లో ఇప్పుడు 2 సీట్లు కోల్పోయింది. ఇక బీహార్‌లో మాత్రం NDA ఆధిపత్యం కొనసాగింది.
అరుణాచల్ ప్రదేశ్‌లో ఒక అసెంబ్లీ స్థానానికి ఎన్నిక జరిగితే అక్కడ స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. అసోంలో 4 స్థానాలకు బైపోల్స్ జరిగితే AIUDF ఒక స్థానంలో, BJP మూడు చోట్ల గెలుపొందాయి. అసోంలో కాంగ్రెస్ అభ్యర్థులకు 34 శాతం ఓట్లు వచ్చినా ఒక్క సీటు కూడా గెలవలేదు. బీహార్‌లోని కిషన్‌గంజ్ బైపోల్‌లో ఎంఐఎం విజయం సాధించింది. బీహార్‌లో MIM ఒక చోట గెలిస్తే, ఇండిపెండెంట్ ఒకటి, JDU ఒకటి, RJD రెండు సీట్లు కైవసం చేసుకున్నాయి. చత్తీస్‌గఢ్‌లో ఎన్నిక జరిగిన ఒక స్థానంలో పట్టునిలుపుకుంటూ కాంగ్రెస్ విజయబావుటా ఎగరేసింది. గుజరాత్‌లో 6 చోట్ల బైపోల్స్ జరిగితే 3 BJP ఖాతాలో పడగా, 3 కాంగ్రెస్ ఖాతాలోకి రావడం విశేషం. హిమాచల్‌లో 2 సీట్లలో BJP గాలే వీచింది.
కేరళలో కాంగ్రెస్ 2 చోట్ల, లెఫ్ట్ 2 చోట్ల విజయం సాధించాయి. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఒక చోట గెలిచింది. మధ్యప్రదేశ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నిక జరిగిన ఒక సీటును నిలబెట్టుకుంది. మేఘాలయలో UDP పార్టీ ఒక సీటులో విజయం సాధించింది. ఒడిశాలో BJD ఆధిపత్యం కొనసాగుతూ పోలింగ్ జరిగిన ఒక స్థానంలో గెలిచింది. పాండిచ్చేరిలో కాంగ్రెస్ గెలవగా, పంజాబ్‌లో 3 సీట్లు కాంగ్రెస్ ఖాతాలోకి వస్తే, ఒకటి శిరోమణి అకాలీదళ్ చేజిక్కించుకుంది. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కి 1, రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీకి ఒక సీటు దక్కాయి. సిక్కింలో BJP ఒక స్థానంలో గెలవగా, సిక్కిం క్రాంతికారీ మోర్చా-SKM ఒక చోట గెలిచింది. తమిళనాడులో అన్నాడీఎంకే 2 చోట్ల గెలవడం విశేషం. ఇది ఒక రకంగా DMK చీఫ్ స్టాలిన్‌కు షాక్ అనే చెప్పాలి. ఇక ఉత్తరప్రదేశ్‌లో BJP ఆరుచోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ ఒక చోట మాత్రమే గెలిచింది. SP 2 చోట్ల గెలిస్తే, BSP ఒక చోట విజయం సాధించింది. అప్నాదళ్ ఒక అసెంబ్లీ సెగ్మెంట్‌లో గెలిచింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com