ఢిల్లీలో బీజేపీ అగ్రనేతల సమావేశం

ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలు సమావేశమయ్యారు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై చర్చిస్తున్నారు. హర్యానాలో ఫలితాలపై బీజేపీ నేతలు నిరాశలో ఉన్నారు. అక్కడ కుల సమీకరణలు ప్రభావం చూపాయంటున్నారు. స్వతంత్రులతో మాట్లాడి అధికారం చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే జేజేపీ, స్వతంత్రులతో బీజేపీ నేతలు మంతనాలు జరుపుతున్నారు. హర్యానాలో కాంగ్రెస్ వ్యూహాలపై ఆరా తీస్తున్న బీజేపీ.. జేజేపీ మద్దతు కాంగ్రెస్‌కు దక్కకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. జేజేపీ అధినేత దుష్యంత్‌తో సీనియర్లు మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే ఫోనులో మాట్లాడిన బీజేపీ అగ్రనేతలు.. హర్యానకు బీజేపీ సీనియర్ నేతలను పంపుతున్నారు.
అటు.. మహారాష్ట్రలో సీట్లు తగ్గడంపై నేతల్లో ఆందోళన ఉంది. శివసేన నుంచి వస్తున్న డిమాండ్లపై నేతలు చర్చిస్తున్నారు. పోలింగ్ సరళి, ఫలితాలపై విశ్లేషిస్తున్నారు. అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉందని పార్టీ భావిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com